బండారు ఉత్సవంలో పాల్గొన్న ఎంపీ క్యాండిడేట్

ఊట్కూర్, వెలుగు: మండలంలోని పెద్దపోర్ల గ్రామంలో సోమవారం  కురువ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ, కలిమెర లింగేశ్వర స్వామి బండారు ఉత్సవంలో మక్తల్  ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, పాలమూరు కాంగ్రెస్  ఎంపీ క్యాండిడేట్​ వంశీచంద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బండారును భక్తులపై చల్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. 

అనంతరం జరిగిన కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్  మాలి పటేల్, రవీందర్ రెడ్డి, వార్డు మెంబర్లు అనుచరులుతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. విగ్నేశ్వర్ రెడ్డి, సూర్యప్రకాశ్ రెడ్డి, కొత్తకోట సిద్ధార్థ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, భీమకవి, భీమయ్య, దుర్గం శ్రీనివాసులు, బసవరాజ్ గౌడ్, మోహన్ రెడ్డి, కొక్కు లింగం పాల్గొన్నారు.