ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపడదు : రఘునందన్ రావు

  • ఎంపీ రఘునందన్ రావు

కౌడిపల్లి, వెలుగు: ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపడదని ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సోమవారం మహమ్మద్ నగర్ పీఏసీఎస్​ బిల్డింగ్​ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో  మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పి కేవలం సన్నవడ్లకు మాత్రమే  ఇస్తామనడం సరికాదన్నారు.

రుణమాఫీ విషయంలో రెండు లక్షల లోపు రుణం ఉన్న రైతులకు 40 శాతం మందికి ఇప్పటికీ రుణమాఫీ కాలేదని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి రైతులందరికీ రుణమాఫీ చేసి ఆదుకోవాలన్నారు. ఎమ్మెల్యే సునీతా రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలన్నారు. సన్న, దొడ్డు తేడా లేకుండా అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలన్నారు. బీజేపీ జిల్లా నాయకుడు రాజేందర్, మండల అధ్యక్షుడు రాకేశ్, బీఆర్ఎస్ నాయకులు పోల నవీన్, దుర్గారెడ్డి, ఎల్లం, ప్రవీణ్ కుమార్, మహిపాల్ రెడ్డి, రవి సాగర్, ప్రతాప్ గౌడ్ ఉన్నారు.

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

తొగుట: మండలంలోని ఎల్లారెడ్డి పేట్ గ్రామ శివారులోని వేంకటేశ్వర కాటన్ ఇండస్ట్రీస్ లో ఎంపీ రఘునందన్​రావు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.7500 నిర్ణయించినట్లు తెలిపారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో చిక్కుడు చంద్రం, విభీషణ్​రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నర్సింలు, అధికారులు పాల్గొన్నారు.