స్కూల్స్​ డెవలప్​మెంట్​లో తల్లులను భాగస్వాములను చేయాలి

నారాయణపేట, వెలుగు: స్కూల్స్​ డెవలప్​మెంట్​లో తల్లులను భాగస్వాములను చేయాలని కలెక్టర్  కోయ శ్రీహర్ష సూచించారు. సోమవారం మద్దూరు మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో అమ్మ ఆదర్శ స్కూల్  కమిటీలపై మద్దూర్, కోస్గి మండలాల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఇకపై ప్రతి స్కూల్​లో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి సర్కారు బడులను బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. 

అన్ని స్కూళ్లకు చైర్మన్ గా ఆయా గ్రామ సంఘాల ప్రెసిడెంట్లు వ్యవహరిస్తారని, కో చైర్మన్ గా స్కూల్  హెచ్ఎం, వీరితో పాటు ప్రతి తరగతి నుంచి ముగ్గురు స్టూడెంట్ల తల్లులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. స్కూళ్ల డెవలప్​మెంట్​తో పాటు గవర్నమెంట్  నుంచి వచ్చే ఫండ్స్​ వినియోగంలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. మద్దూరు, కోస్గి మండలాల్లో ఇప్పటికే 55 స్కూళ్లలో చేయాల్సిన అభివృద్ధి పనుల ఎస్టిమేట్లను తయారు చేశారని, స్కూల్ కమిటీలు తీర్మానం చేస్తే వర్క్స్​ స్టార్ట్​ చేయవచ్చన్నారు. కాడా స్పెషల్​ ఆఫీసర్  వెంకట్ రెడ్డి, డీఈవో అబ్దుల్ ఘని, అడిషనల్  డీఆర్డీవో అంజయ్య, మద్దూర్  ఎంపీడీవో జయరాములు, తహసీల్దార్  మహేశ్ గౌడ్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అనిత, శోభ పాల్గొన్నారు.