అనుమతిచ్చిన కేంద్ర హోం శాఖ

అనుమతిచ్చిన కేంద్ర హోం శాఖ

న్యూఢిల్లీ: మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీకి విదేశాల నుంచి విరాళాలు తీసుకునేందుకు ఉన్న లైసెన్స్  రెన్యువల్​కు కేంద్ర హోం శాఖ అనుమతిచ్చింది. ఈమేరకు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్​సీఆర్ఏ) కింద చారిటీ విరాళాలు పొందవచ్చని పేర్కొంది. ఎఫ్​సీఆర్ఏ కింద రిజిస్ట్రేషన్ రెన్యువల్​కు చారిటీ పెట్టుకున్న అప్లికేషన్​ను డిసెంబర్ 25న కేంద్రం రిజెక్ట్ చేసింది. అప్లికేషన్  ప్రాసెస్​లో లోపాలు ఉండడంవల్లే రిజిస్ట్రేషన్​ను తిరస్కరించామని పేర్కొంది. వాటిని సరిదిద్ది నిబంధనల మేరకు మరోసారి దరఖాస్తు చేయడంతో కేంద్రం అనుమతిచ్చింది.