యాదాద్రి జిల్లాలో దారుణం.. ఐదేళ్ల కుమారుడిని చంపి తల్లి ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల కుమారుడికి ఉరి వేసి హత్య చేసి అనంతరం తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామానికి చెందిన  జడల సోనీ (31)కి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న సోనీ ఇవాళ (2024, అక్టోబర్ 7) చిన్న కొడుకు శ్రేయాన్శ్ (3)కు ఉరివేసి హత్య చేసింది.

అనంతరం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుమారుడి హత్య, సోనీ ఆత్మహత్య గురించి ఆరా తీస్తున్నారు. మృతురాలి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత కొంతకాలం నుండి సోనీ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.