మంజీరా నదిలో దూకిన తల్లీకొడుకు .. గాలింపు చేపట్టిన పోలీసులు

చిలప్‌‌‌‌చెడ్‌‌‌‌/ఆంధోల్‌‌‌‌, వెలుగు : మెదక్‌‌‌‌, సంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న మంజీరా నదిలో తల్లీకొడుకు దూకినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మంజీరా నది బ్రిడ్జిపై ఏపీ 29 ఆర్​  9299 నంబర్‌‌‌‌ గల బైక్‌‌‌‌ అనుమానాస్పదంగా నిలిపి ఉంచడంతో మంగళవారం రాత్రి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బైక్​ మీద వచ్చిన మహిళ, యువకుడు నదిలోకి దూకినట్లు అనుమానిస్తున్నారు.

 బైక్‌‌‌‌ వివరాల ఆధారంగా ఇక్కడికి వచ్చిన వారు సంగారెడ్డి జిల్లా ఆంధోల్‌‌‌‌ మండలం చింతకుంట గ్రామానికి చెందిన తల్లీకొడుకు వడ్ల బాలమణి (42),  వడ్ల శ్యామ్‌‌‌‌ (28)గా భావిస్తున్నారు. అంధోల్‌‌‌‌, మెదక్‌‌‌‌ జిల్లా పరిధిలోని చిలప్‌‌‌‌చెడ్‌‌‌‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మంజీరా నదిలో గాలింపు చేపట్టారు.