నాగర్ కర్నూల్ లో విషాదం..మిద్దె కూలి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లా మండల కేంద్రంలోని వనపట్లలో ఇల్లు కూలడంతో తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. జూన్ 30వ తేదీ రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసిన మట్టి మిద్దె కుప్పకూలింది. అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మిద్దె కూలడంతో తల్లి గొడుగు పద్మ 26), ఇద్దరు కూతుర్లు పప్పి(6), వసంత(6), కుమారుడు(10 నెలలు) విక్కిలు చనిపోయారు. తండ్రి భాస్కర్(28) కు తీవ్ర గాయాలు అయ్యాయి.

 వెంటనే స్థానికులు గాయపడిన వ్యక్తిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరకుని పరశీలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.