అద్భుతమా.. మహా అద్భుతమా..! ....ఆదివారం.. ఆషాఢ అమావాస్య.. పుష్యమి నక్షత్రం

అరుదైన ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు ఈ శ్రీక్రోధినామసంవత్సరం తీసుకువస్తోంది. వీటిలో ఆగస్టు 4వ తేదీన అరుదైన అవకాశం వస్తోంది.  ఆషాఢమాసం... ఆదివారం .... అమావాస్య.. పుష్యమి నక్షత్రంలో  రానుంది.  ఈరోజు చాలా పవర్​ఫుల్​ రోజు. సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు, అమావాస్య రావడం చాలా అరుదు. అందులోనూ పుష్యమీ నక్షత్రం కలసి వస్తున్నాయి. ఈ మహిమోపేతమైన రోజును మహాపురాణాలు ఈ విధంగా చెబుతున్నాయి.

ఈ ఏడాది 3 ఆగస్టు 2024 శనివారం మధ్యాహ్నం 3:31 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 4 ఆగస్టు 2024 ఆదివారం మధ్యాహ్నం 3:54 గంటల వరకు ఉంటుంది. ఇదే రోజున పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:26 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు ఎవ్వరిని హింసించడం కాని ..ఎవ్వరిని ఇబ్బందిపెట్టడం చెయ్యకండి. కోరి కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్టే అవుతుంది

పుష్యమి లేదా ఆరుద్రా లేదా పునర్వసు నక్షత్రాలలో ఏదో ఒకటి  అమావాస్యలో వస్తే అది పిత్రార్చనలకు మహాపర్వదినం. ఆ రోజున అర్చిస్తే పితృదేవతలు 12 సంవత్సరాలు తృప్తి చెందుతారు అని పురుషోత్తమ పురాణమైనటువంటి విష్ణుపురాణం చెబుతోంది.

ALSO READ | శ్రావణమాసం... వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది.. ఏ రోజు ఏపూజ చేయాలి

ఆషాఢమాసం అమావాస్య (ఆగస్టు4) రోజున పెద్దలకు పిండప్రదానం, తిలతర్పణాదులు చేయాలి. ఇవి చేయలేని వారు కనీసం గోసేవ చేసుకోవాలి. తమకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి, తమ పెద్దలను పేరు పేరునా తలచుకొని ఆవులకు మేత వేస్తే పిండతర్పణాదులు చేసిన ఫలం వస్తుంది. సాధారణంగా పితరుల అర్చన చేయడానికి కొన్ని నియయాలు, నిషేధాలు ఉన్నాయి. 

గోరూపంలో ఉన్న పెద్దలను సేవించడానికి ఎటువంటి నిషేధాలు లేవు. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు జీవించి ఉన్నవారు/లేనివారు అనే భేదం లేకుండా అందరూ ఆవుకు గ్రాసం వేసి, పెద్దలను స్మరించుకొని, నమస్కరించుకోవచ్చు. 

దీనివలన కలిగే లాభం ఏడుకొండలూ ఎక్కి, మొక్కి, నిలువుదోపిడీ ఇచ్చినా కలుగదు. ఎందుకంటే మనం కోరిన కోరికలు తీర్చే డిపార్టుమెంటు వెంకన్నది కాదు, పితరులది!. మీరు పిలువకుండా మీ కూడా ఉండి, మీకు ఏంకావాలో అహర్నిశం చూస్తూ... మీకోసమే ఉన్న దేవతలే పితరులు. ..వారు ఉన్నదే మీకోసం. ..ఈ సత్యం మరిచిపోతే పితరుల శాపాలు తగులుతాయి. ఆషాఢమాసం అమావాస్య ( ఆగస్టు4) పెద్దలను అర్చిస్తే... అశ్వమేధయాగాలు చేసిన ఫలం లభిస్తుంది.