సందేహం ఏదైనా సరే స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే టక్కున గూగుల్‌ని అడగొచ్చు. సెర్చ్ ఇంజన్లన్నీ జల్లెడ పట్టి ఇన్ఫర్మేషన్ పట్టేయొచ్చు. సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్.. టాపిక్ ఏదైనా సరే చిటికెలో జవాబిస్తుంది గూగుల్. అందుకే గూగుల్ ఫాలోవర్స్ ప్రతిఏటా రెట్టింపు పెరుగుతున్నారు. లాక్డౌన్ పుణ్యమా అని ఈ ఏడాది గూగుల్‌ని ఇంకాస్త ఎక్కువగానే వాడారు. ఇంతకీ 2020లో గూగుల్‌ని ఎక్కువగా అడిగిన ప్రశ్నలేంటి?
గూగుల్ మోస్ట్ సెర్చ్ 2020 పర్సన్స్ లిస్ట్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగినప్పటి నుంచీ మనదేశంలో బైడెన్ గురించే ఎక్కువగా సెర్చ్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో రిపబ్లికన్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ అర్ణబ్ గోస్వామి నిలిచాడు. మూడో ప్లేస్‌లో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఉంది. కరోనా బారిన పడిన విషయం తెలియక ఆమె ఓ పార్టీలో పాల్గొంది. కొవిడ్ రూల్స్‌ని పాటించలేదంటూ ఆమెపై కేసు నమోదైంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత గూగుల్‌లో కనికా పేరుని ఎక్కువగా సెర్చ్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరకొరియా ప్రెసిడెంట్ కిమ్‌జాంగ్ ఉన్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, రషీద్ ఖాన్, హీరో సుశాంత్ ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తి, అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కమలా హ్యారీస్, హిందీ టెలివిజన్ స్టార్ అంఖిత లోఖండే, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పేర్లని గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేశారు.
ఇవి ఎలా చేయాలి
ఈ ఏడాది మోస్ట్ సెర్చ్ రెసిపీల లిస్ట్‌లో పన్నీర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. పన్నీర్ తయారీ గురించి, దాంతో చేసే వెరైటీ వంటల గురించి ఎక్కువగా వెతికారు. అలాగే ఇమ్యూనిటీ పెంచే రెసిపీల కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో డాల్గొనా కాఫీ నిలిచింది. లాక్డౌన్లో డాల్గోనా కాఫీ ట్రెండ్ కావడంతో చాలామంది దీని తయారీ గురించి వెతికారు. వరల్డ్ వైడ్‌గానూ డాల్గోనా కాఫీ సెర్చింగ్ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అలాగే ఈ ఏడాది మనోళ్లు జిలేబీ మేకింగ్ ప్రాసెస్‌ని గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేశారు .
మరణం తర్వాత
బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ పెద్ద పేగు ఇన్ఫెక్షన్ బారిన పడి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణం తర్వాత ఇ–కొలి ఇన్ఫెక్షన్ గురించి ఎక్కువగా వెతికారు. ఆ వ్యాధి ఎందుకొస్తుంది?, లక్షణాలేంటనే ప్రశ్నలు గూగుల్ సెర్చ్ బార్లో ఎక్కువగా కనిపించాయి. ఈ ఏడాది మనదేశంలో మోస్ట్ గూగుల్డ్ ప్రశ్నల్లో ఈ ఇన్ఫెక్షన్ ఆరో ప్లేస్‌లో నిలిచింది. అలాగే హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత నెపోటిజం గురించి ఎక్కువగా వెతికారు. సోలార్ ఎక్లిప్స్, ఎన్.ఆర్.సి, ఇండియన్ సిటిజన్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నెపొటిజం గురించి కూడా ఎక్కువగా వెతికారు నెటిజన్లు.
కరోనానే టాప్
గూగుల్ సెర్చ్‌లో ఈ ఏడాదంతా కరోనా హవానే నడిచింది. కరోనా ఎందుకొస్తుంది? అనే ప్రశ్నతో మొదలుపెట్టి వస్తే ఏం చేయాలి? ఏం తినాలి? లక్షణాలు ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? హోం ఐసోలేషన్‌లో ఎలా? లాంటి ప్రశ్నలన్నింటిని గూగుల్‌లో వెతికారు చాలామంది. మనదేశంలోనే కాదు వరల్డ్ వైడ్ టాప్ సెర్చింగ్ లిస్ట్‌లోనూ కరోనానే టాప్. అలాగే ప్లాస్మా థెరపీ గురించి కూడా నెట్టింట్లో ఎక్కువగా అడిగారు. 2020 మోస్ట్ సెర్చ్ లిస్ట్‌లో ప్లాస్మా థెరపీ థర్డ్ ప్లేస్‌లో నిలిచింది.
ఎవరీ బినోద్
ఆగష్టులో ‘బినోద్ థారు’ అనే పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. పేటీఎం, ట్విట్టర్, నెట్‌ఫ్లిక్స్, ఎయిర్టెల్, డిస్నీ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, టిండర్, స్విగ్గీ లాంటి టాప్ బ్రాండ్స్ బినోద్ పేరుతో మీమ్స్ పోస్ట్ చేశాయి. దాంతో ‘ఎవరీ బినోద్’? అంటూ నెటిజన్స్ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ‘స్లే పాయింట్’ అనే హిందీ యూట్యూబ్ ఛానెల్ జులై 15న ‘వై ఇండియన్ కామెంట్స్ సెక్షన్ ఈజ్ గార్బేజ్ (బినోద్) అనే వీడియోని పోస్ట్ చేసింది. తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన వీడియోలకు వచ్చిన విచిత్రమైన కామెంట్లను చదివారు ఆ వీడియో వీక్షకులు. అయితే వాళ్లు అప్‌లోడ్ చేసిన వీడియోలన్నింటి కామెంట్ సెక్షన్స్‌లో ‘బినోద్’ పేరు కనిపించింది. దాంతో అన్ని ప్రశ్నలకు బినోద్ అని సమాధానం వాడుకోవచ్చని వ్యంగ్యంగా కామెంట్ చేశారు ఆ ఛానెల్ యూట్యూబర్స్ అభ్యుదయ్, గౌతమి. అంతే.. ఇక బినోద్ ట్రెండింగ్ హవా ప్రారంభమైంది. ఒక్క రోజులోనే స్టార్ హీరో రేంజ్ పాపులారిటీ వచ్చింది. ఇతను ఎవరో తెలుసుకునేందుకు నెటిజన్స్ గూగుల్ హెల్ప్ తీసుకున్నారు.
For More News..
ఈ ఏడాది బ్యాలెన్స్ తప్పింది!
నీతి ఆయోగ్ న్యూఇయర్ ప్లాన్స్
రోహిత్ ఆడాలంటే మరోకరిపై వేటు పడాల్సిందే..
