శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తాం: టీటీడీ ఈవో

తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి పద్మావతి విశ్రాంతి భవనంలో జరిగిన సమావేశంలో కాలిబాట భక్తుల భద్రతా చర్యలపై ఈవో సమీక్షించారు. ఈ సమావేశంలో  ప్రభుత్వ అటవీ, టీటీడీ అటవీ, ఇంజనీరింగ్, భద్రత విభాగాల అధికారులు పాల్గొన్నారు.  శ్రీవారి మెట్టు మార్గంలో  చిరుతలు ఇతర జంతువుల సంచారాన్ని గుర్తించేందుకు ఇప్పుడునంన ట్రాప్​కెమెరాలతో పాటు ఒంకా మరికొన్ని ట్రాప్​ కెమారాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ఏడవ మైల్ వరకు  జంతువుల కదలికలు ఎప్పటి కప్పుడు కంట్రోల్ రూంకు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని ఇంజనీరింగ్​ అధికారులను ఆదేశించారు.  జంతువుల కదలికలపై సమాచారాన్నిఎప్పటికప్పుడు భద్రత విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులను హెచ్చరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సంయుక్త కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు చాలా ఖర్చుతో కూడుకున్నందున..   తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలను ...  ప్రత్యామ్నాయ మార్గాలను సూచించవలసిందిగా కమిటీ వారికి వారికి లేఖ  రాయాలని అధికారులను ఆదేశించారు.

 కాలినడక మార్గంలో  ఏఏ సమయాల్లో చిరుతలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయి, తదితర సమాచారాన్ని అటవీ అధికారులు పీపీటీ ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించి కాలినడక భక్తులకు నిర్దేశించిన సమయాల్లోనే తిరుమలకు చేరుకునేలా, ఆ సమయాల్లో మార్పులు చేయవలసిందిగా ఈవో దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన అధికారులతో చర్చించి, తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జేఈవో  వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్వో  నరసింహ కిషోర్ కు సూచించారు.  అంతకుముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ ప్రతిపాదనలు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారిచ్చిన ప్రతిపాదనలను అటవీ విభాగం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఎస్వి జూ పార్క్ క్యూ రేటర్  సెల్వం, తిరుపతి డిఎఫ్ఓ  సతీష్, సబ్ డిఎఫ్ఓ  శ్రీనివాస్, సిఈ   నాగేశ్వరరావు, ఎస్ఈ 2  జగదీశ్వర్ రెడ్డి,  పంచాయతీ ప్రత్యేక అధికారి  మల్లికార్జున్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.