జీహెచ్ఎంసీ ప్రజావాణి.. ఇండ్ల కోసమే అధిక దరఖాస్తులు

వెలుగు, నెట్ వర్క్: జీహెచ్ఎంసీలో సోమవారం జరిగిన ప్రజావాణికి 177 ఫిర్యాదులు రాగా, వాటిని 10 రోజుల్లోగా పరిష్కరించాలని కమిషనర్ ఇలంబరితి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్​ కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ కదిరివన్ ప్రజలను అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 1,637 దరఖాస్తు రాగా, వీటిలో అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 1593 అందాయి. రంగారెడ్డి కలెక్టరేట్​లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 92 మంది అర్జీలు సమర్పించారు.