ఓవైపు కరోనా ను అరికట్టేందుకు కేంద్రం కృషి చేస్తుంటే…, మీ పని మీరు చేయండి నా పని నేను చేసుకుంటానన్న చందంగా కరోనా వ్యాప్తి చెందుతుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబేకి కరోనా సోకింది. స్పల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నానని, దాంట్లో తనకు వైరస్ సోకినట్లు తేలిందని మంత్రి స్వయంగా ప్రకటించారు. డాక్టర్ల సలహాలు, కొవిడ్ ప్రొటోకాల్స్ ప్రకారం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి చౌబే తెలిపారు. ఇటీవల కాలంలో తనతో సన్నిహితంగా మెలిగినవారంతా వెంటనే కొవిడ్ టెస్టులు చేయించుకుని ఐసోలేషన్ లో ఉండాలని కోరారు.
