AUS vs IND: అప్పుడే తుది నిర్ణయం తీసుకుంటాం.. గిల్ గాయంపై భారత బౌలింగ్ కోచ్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు ముందు టీమిండియా యువ బ్యాటర్ శుభమాన్ గిల్ తొలి టెస్టుకు దూరమవుతున్నాడని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో పడికల్ రావడంతో గిల్ ఆడడం దాదాపు అసాధ్యం అని భావించారు. అయితే గిల్ తొలి టెస్టు నుంచి అధికారికంగా దూరమయ్యాడని ఎక్కడా ప్రకటన రాలేదు. తాజాగా టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్.. గిల్ గాయంపై ట్విస్ట్ ఇచ్చాడు. అతని గాయంపై స్పందిస్తూ శుభవార్త చెప్పాడు. 

మోర్నీ మోర్కెల్ గాయంపై మోర్కెల్ మాట్లాడుతూ.."గిల్ రోజు రోజుకూ మెరుగవుతున్నాడు. అతను తొలి టెస్ట్ ఆడతాడా లేదా అనే విషయంపై ఆ రోజు ఉదయం నిర్ణయం తీసుకుంటాం. గిల్ సిమ్యులేషన్‌లో బాగా ఆడాడు". అని మోర్కెల్ చెప్పుకొచ్చాడు. ఇండియా ఏ తో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గిల్ కు గాయమైంది. స్లిప్ లో క్యాచ్ పట్టే క్రమంలో గిల్ చేతి వేళ్ళకు గాయానికి గురయ్యాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో 28 పరుగులు చేసిన గిల్ పర్వాలేదనిపించాడు. 

Also Read :- శాంసన్‌కు ప్రయోషన్.. కెప్టెన్‌గా బాధ్యతలు

తొలి టెస్టుకు భారత యాజమాన్యం గిల్ ను ఆడించే ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. 25 ఏళ్ల గిల్ తన తొలి టెస్టును ఆస్ట్రేలియాపై ఆడాడు. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 51.80 సగటుతో 259 పరుగులు చేశాడు. వీటిలో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్రిస్బేన్‌లో ది గబ్బాలో జరిగిన చివరి టెస్టులో 91 పరుగులు చేసి భారత్ సిరీస్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. నవంబర్ 22-26 తేదీలలో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్ట్ ఆడనుంది.