పక్కా ఇండ్లు ఉన్నా.. ఇందిరమ్మకు అప్లికేషన్

  • వెరిఫై చేసిన 31 లక్షల దరఖాస్తుల్లో రెండు లక్షలకు పైగా ఇట్లాంటివే..
  • ఒక్కో దరఖాస్తు వెరిఫికేషన్​కు అరగంట
  • ఇంటింటికీ వెళ్లి  సర్వే చేస్తున్న సిబ్బంది
  • రాష్ట్రవ్యాప్తంగా  80 లక్షలకు పైగా అప్లికేషన్లు 
  • సంక్రాంతి కల్లా సర్వే పూర్తి కష్టమే..

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హుల ఎంపిక ప్రభుత్వ సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఖాళీ జాగాలు, గుడిసెలు, పెంకుటిల్లు ఉన్నోళ్లే కాకుండా కాంక్రీట్​బిల్డింగులతో పక్కా ఇండ్లు ఉన్నోళ్లు సైతం ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పక్కా ఇండ్లు ఉన్నప్పటికీ ఎందుకు అప్లై చేసుకున్నారని సిబ్బంది అడిగితే.. సర్కార్ డబ్బులు ఇస్తే, కూల్చి కొత్తది కట్టుకుంటామని చెబుతున్నారు. వద్దంటే ఎక్కడ గొడవ చేస్తారోనని అలాంటి ఇండ్ల వివరాలను కూడా ఆన్​లైన్​లో నమోదు చేస్తున్నామని, అందుకే సర్వే లేట్​అవుతున్నదని సిబ్బంది చెబుతున్నారు. 

ఇలాగైతే సర్వే సంక్రాంతి లోపు పూర్తి కావడం కష్టమేనని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 31 లక్షలకు పైగా అప్లికేషన్లను వెరిఫై చేయగా, అందులో 2 లక్షలకు పైగా పక్కా ఇండ్లు ఉన్నవేనని తేలింది. అదే విధంగా 4.5 లక్షల మంది రేకుల ఇండ్లలో, 2 లక్షల మంది పెంకుటిండ్లలో ఉంటున్నట్టు గుర్తించారు. అయితే మొదటి దశలో జాగా ఉండి ఇల్లు లేని వారికి, పూరిగుడిసెల్లో, శిథిలావస్థకు చేరిన ఇండ్లల్లో ఉంటున్న వారికి ఆర్థిక సాయం అందజేస్తామని సర్కార్ ప్రకటించింది. 

వెరిఫికేషన్ కు మొబైల్ యాప్.. 

ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 80.54 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మొదటిదశలో సొంతంగా ఇంటి జాగా ఉన్న 4.50 లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇంటి నిర్మాణం కోసం వివిధ దశల్లో కలిపి రూ.5 లక్షలు ప్రభుత్వం సాయం కింద అందించనుంది. అర్హులను గుర్తించేందుకు సెంటర్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ గుడ్‌‌‌‌‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌(సీజీజీ) సహకారంతో ‘ఇందిరమ్మ ఇండ్ల ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్షన్‌‌‌‌‌‌‌‌ మొబైల్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌’ రెడీ చేసింది. సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో సర్వే నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో గత 15 రోజులుగా సిబ్బంది మున్సిపాలిటీలు, గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో 20, 30 టీమ్ ల చొప్పున తిరుగుతుండగా.. గ్రామాల్లో రెండు నుంచి మూడు టీమ్ లు సర్వేలో పాల్గొంటున్నాయి.  గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, వీవోఏలు, అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లకు సర్వే బాధ్యతలను అప్పగించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలకు పైగా అప్లికేషన్లను వెరిఫై చేశారు.   

ఆలస్యమవుతున్న సర్వే..

ఒక్కో దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి, ఫొటోలు తీసి వివరాలన్నీ అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేయడానికి సిబ్బందికి కనీసం 30 నిమిషాలకు పైగా సమయం పడుతున్నది. ఒక్క టీమ్‌‌‌‌‌‌‌‌ ఒక్క రోజులో 15 నుంచి 20 దరఖాస్తులకు మించి చేయడం లేదు. మొబైల్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌లో నాలుగు పేజీలు ఉన్నాయి. ప్రతి పేజీ నింపి ఇల్లు/ ఇంటి జాగా ఫొటో,  ఇంటి స్థలం పేపర్లు, ఇంటి పన్నుల రసీదులు అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. అద్దెకు ఉండేవాళ్లు, వికలాంగులు, తల్లి, తండ్రి లేకుండా ఒంటరిగా జీవించేవాళ్లు, సింగిల్‌‌‌‌‌‌‌‌ ఉమెన్‌‌‌‌‌‌‌‌,  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్లు, సఫాయి కర్మాచారిలు, రోడ్డు వెడల్పులో, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇండ్లు కోల్పోయిన వాళ్ల వివరాలను ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. 

ఇండ్ల కంటే ఎక్కువ దరఖాస్తులు.. 

భూపాలపల్లి జిల్లా రేగొండ గ్రామ పంచాయతీలో మొత్తం 1,006 ఇండ్లు ఉన్నాయి. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 1,089 దరఖాస్తులు వచ్చాయి. అంటే గ్రామంలో ఉన్న ఇండ్ల కంటే ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. అయినా కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తు చేసిన ప్రతి ఇంటికి వెళ్లి, మొబైల్‌‌‌‌‌‌‌‌ యాప్ ద్వారా పకడ్బందీగా సర్వే చేస్తున్నాం. ఇప్పటివరకు 260 ఇండ్ల సర్వే పూర్తి చేసినం. ఇందులో పక్కా ఇల్లు ఉన్నవారు కూడా ఉన్నారు. 

తుల్జారాణి, రేగొండ పంచాయతీ కార్యదర్శి, భూపాలపల్లి జిల్లా