జొమాటో, స్విగ్గీల రికార్డుల మోత
న్యూఢిల్లీ: కరోనా రూల్స్ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో న్యూ ఇయర్ వేడుకలకు ఫుడ్ డెలివరీ యాప్స్ రికార్డుల మోత మోగించాయి. .న్యూ ఇయర్ వేడుకల కోసం నిమిషానికి ఏకంగా 4,254 ఆర్డర్లు వచ్చినట్లు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వెల్లడించింది. జొమాటో సీఈఓ దీపిందర్ గోయెల్ తెలిపారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఆర్డర్లు 60 శాతం పెరిగాయన్నారు. మరో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కూడా నిమిషానికి 5,500 ఆర్డర్లు అందుకున్నట్లు ప్రకటించింది. తమ ప్లాట్‌ఫామ్‌పై కొత్త యూజర్లు రెండింతలు పెరిగినట్లు తెలిపింది. గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యూ (జీఎంవీ) రూ. 75 కోట్లను దాటిందని దీపిందర్ గోయెల్ ట్వీట్ చేశారు. గురువారం రాత్రి లక్ష మంది డెలివరీ పార్ట్‌నర్స్ పనిచేసినట్లు పేర్కొన్నారు.
For More News..
వీడియో: రజినీకాంత్ ‘దర్బార్’కొచ్చిన డేవిడ్ వార్నర్
కరోనాతో పాటు అన్ని వైరస్‌లు ఖతం చేసే బయో స్టెర్ల్ ఎయిర్
ఇంకో రెండు టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఆడతా
