గతేడాది కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి కంటే .. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. రోజురోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందన్నారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన గడ్కరీ.. రోడ్డు ప్రమాదాల విషయంలో కేంద్రం తీవ్ర ఆందోళనగా ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై చాలా సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా కారణంగా 1.46 లక్షల మంది చనిపోయారని... కానీ రోడ్డు ప్రమాదాలతో 1.5 లక్షల మంది మృతి చెందారన్నారు. అయితే ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారంతా 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారేనని తెలిపారు గడ్కరీ.
