జైకోవ్-డి మూడు డోసుల వ్యాక్సిన్ అని చెప్పారు జైడస్ గ్రూప్ ఎండీ షార్విల్ పటేల్. నిన్న ఈ వ్యాక్సిన్ కు ఎమర్జెన్సీ అప్రూవల్ వచ్చిందన్నారు. 28 రోజుల వ్యవధితో మూడు డోసులు వేస్తారని చెప్పారు. ఇది 12 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వొచ్చని చెప్పారు. జైకోవ్-డి వ్యాక్సిన్ ఎఫికసి 66 శాతంగా ఉందని చెప్పారు. వచ్చేవారం జైకోవ్-డి వ్యాక్సిన్ ధరపై క్లారిటీ ఇస్తామని చెప్పారు. వ్యాక్సిన్ సరఫరా సెప్టెంబర్ మధ్య నుంచి ప్రారంభమవుతుందన్నారు. అక్టోబర్ నుంచి కొత్త ప్రొడక్షన్ ప్లాంట్ లో నెలకు కోటి వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేస్తామని చెప్పారు.
