యాక్సెంచర్ ఉద్యోగుల‌కు షాక్..నైపుణ్యం పేరుతో విధుల నుంచి తొల‌గింపు

యాక్సెంచర్ ఉద్యోగుల‌కు షాక్..నైపుణ్యం పేరుతో విధుల నుంచి తొల‌గింపు

టెక్ దిగ్గ‌జం యాక్సెంచర్ భార‌త్ తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న 25వేల‌మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొల‌గిస్తున్నట్లు ఆస్ట్రేలియ‌న్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వే సంస్థ తెలిపింది.

అందుకు ఊతం ఇచ్చేలా ఆగ‌స్ట్ నెల‌లో యాక్సెంచ‌ర్ సీఈఓ జూల్వీ స్వీట్ ఇంట్ర‌ర్న‌ల్ గా నిర్వ‌హించిన స‌మావేశంలో నైపుణ్యం లేని ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణ‌యం తీసుకోవ‌డాన్ని ప్ర‌స్తావించిన‌ట్లు చెప్పింది.

ఇక భార‌త్ కు చెందిన యాక్సెంచ‌ర్ లో సుమారు 2ల‌క్ష‌ల‌మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్న‌ట్లు వారిలో నైపుణ్యం లేని వారిని ఉద్యోగుల్ని తొల‌గిస్తున్న‌ట్లు స‌ద‌రు ఫైనాన్షియ‌ల్ సంస్థ వెల్ల‌డించింది.

అయితే ఆస్ట్రేలియన్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వే సంస్థ నివేదిక‌పై యాక్సెంచ‌ర్ స్పందించింది. ప్రతి సంవత్సరం మా ప‌నితీరు, సామర్థ్యంపై చ‌ర్చిస్తామ‌ని, క్ల‌యింట్ల‌కు టైం టూ టైం ప్రాజెక్ట్ ల‌ను సబ్మిట్ చేస్తున్నామా లేదా అని అందుకు అనుగుణంగా ఉద్యోగుల ప‌నితీరుపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించింది. క్లయింట్లకు కేటాయించాల్సిన పనిగంటలు భారీగా తగ్గాయని, నైపుణ్యం కలిగిన టెకీల ఉద్యోగాలకు ఎలాంటి డోకా ఉండదని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు.