ఉత్తరప్రదేశ్ లో ఓ కోతి .. జనాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో ఓ వ్యక్తి దగ్గర్నుంచి క్యాష్ బ్యాగ్ ఎత్తుకెళ్లింది కోతి. ఆ బ్యాగ్ లో నాలుగు లక్షల రూపాయలు ఉండటంతో.. ఆ వ్యక్తి షాకయ్యాడు. సీతాపూర్ లోని వికాస్ భవన్ దగ్గరున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు ఓ వ్యక్తి వచ్చాడు. నాలుగు లక్షల రూపాయలున్న బ్యాగ్ పట్టుకుని వచ్చాడు. అతను నడుస్తూ వెళ్తుండగా పక్కనే చెట్టుపై ఉన్న ఓ కోతి అతడి దగ్గరకొచ్చి బ్యాగ్ లాక్కుని వెళ్లి.. చెట్టెక్కింది. దీంతో అతని… పై ప్రాణాలు పైనే పోయాయి.
కోతి డబ్బులు ఎత్తుకెళ్లిన విషయాన్ని అక్కడే ఉన్నవారికి చెప్పాడు ఆ వ్యక్తి. అప్పటికే కోతి ఆ బ్యాగ్ తో చెట్టుపై భాగానికి వెళ్లింది. అంతటితో ఆగకుండా దాన్ని ఓపెన్ చేసి.. అందులోంచి కొన్ని నోట్లు కిందకు విసిరేసింది. దాదాపు 14 వేల వరకు కరెన్సీ నోట్లు కిందపడ్డాయని స్థానికులు చెప్పారు. కోతి డబ్బులు పడేస్తుండటంతో అప్రమత్తమైన స్థానికులు దానిని బెదిరించి ఆ సంచి కిందపడేలా చేశారు. ప్రయత్నాలన్నీ ఫలించి.. కోతి ఆ సంచిని కిందకు పడేయటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
