‘ఉపాధి’  బడ్జెట్ ​అంచనాలను మించొద్దు.. : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ చీఫ్ కంట్రోలర్  రామకృష్ణ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : గ్రామీణ ఉపాధి హామీ  పనుల్లో బడ్జెట్ అంచనాలకు మించి   బిల్లులు చేయవద్దని  రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ చీఫ్ కంట్రోలర్ రామకృష్ణ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లాలో రాష్ట్రస్థాయి ఉపాధి హామీ పథకం పర్యవేక్షణ బృందం పర్యటించి పనులను పరిశీలించారు. అనంతరం  నాగర్ కర్నూల్ కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లాకు చెందిన ఉపాధి హామీ ఏపీడీలు, టెక్నికల్ అసిస్టెంట్లు,ఈసీలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల అంచనాలకు అనుగుణంగా   బిల్లులను ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు.    జిల్లాలో  పనులకు సంబంధం లేకుండా  బిల్లులు రూపొందిస్తున్నారని,  క్షేత్రస్థాయిలో పరిశీలించి బిల్లులను ఆమోదించేందుకు  జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు కిరణ్ బేడీ, కృష్ణారావు, ఆనంద్ రెడ్డి, డీ ఆర్ డీఏ చిన్న ఓబులేషన్, పాల్గొన్నారు.