ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు లండన్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ రేసు అగ్రిమెంట్లో భాగంగా 2023 ఫిబ్రవరిలో 9 సీజన్ ముగియడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 10న సీజన్ 10 నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో వివిధ కారణాలతో సీజన్ 10 రద్దు చేసుకుంటున్నట్లు ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ 2023 అక్టోబర్ 27న నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీంతో ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎంఏయూడీ మధ్య 2023 అక్టోబర్ 30న కొత్త అగ్రిమెంట్ జరిగింది.
ఈవెంట్ నిర్వహణ కోసం రూ.90 కోట్లు ఎంఏయూడీ ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 10న అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి, డిసెంబర్ 4 వరకు కొనసాగింది. అక్టోబర్ 3న ఫస్ట్ఇన్స్టాల్మెంట్ కింద రూ.22 కోట్ల 69 లక్షల 63 వేల 125 , అక్టోబర్ 11న రెండో ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ. 23 కోట్ల లక్షా 97 వేల 500 రిలీజ్చేయగా.. హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ ఓవర్‌సిస్ బ్యాంక్ నుంచి యూకేలోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ అకౌంట్‌కు అక్టోబర్11న ట్రాన్స్‌ఫర్ అయ్యాయి.
Also Read:-ఫార్ములా ఈ రేసింగ్ కేసులో 600 కోట్ల అగ్రిమెంట్.. కేటీఆర్ ఆదేశాల మేరకే..
ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగానే రూ. 45.71 కోట్లను ఫార్ములా ఈ ఆపరేషన్స్‌కు హెచ్‌ఎండీఏ అకౌంట్ నుంచి యూకేకు డబ్బులు బదిలీ అయ్యాయి. ఆర్బీఐకి సమాచారం లేకుండా విదేశాలకు ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ కావడం వల్ల ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు హెచ్‌ఎండీఏ ఫైన్రూపంలో రూ. 8 కోట్ల 6 లక్షల 75 వేల 404 చెల్లించాల్సి వచ్చింది. దీంతోపాటు వివిధ ఫీజుల రూపంలో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్(ఎఫ్ఐఏ), ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎమ్ఐ)కి రూ. కోటి 10 లక్షల 51 వేల 14 ను హెచ్‌ఎండీఏ చెల్లించింది.
ఇలా సీజన్ 10 కోసం మొత్తం రూ. 54 కోట్ల 88లక్షల 87 వేల 43ను హెచ్‌ఎండీఏ చెల్లింపులు చేసింది. ఆర్బీఐకి సమాచారం ఇవ్వకుండా, అదీ ఎన్నికల కోడ్ ఉన్న టైమ్‌లో యూకేకు మనీ ట్రాన్స్‌ఫర్ కావడం వెనుక స్కామ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మనీలాండరింగ్ కావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.