నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా: మోహన్ బాబు

మంచు ఫ్యామిలీలో గొడవలు అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ లు పరస్పర ఫిర్యాదులు చేయడంతో మొదలైన రచ్చ చాలా మలుపులు తిరిగింది. ఆస్తి పంపకాల విషయంలో చర్చలకు మంచు మనోజ్, మోహన్ బాబు, మంచు విష్ణు ఓకే చెప్పటంతో వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే..మోహన్ బాబు తన లైసెన్సుడ్ గన్ ని పోలీసులకు సబ్మిట్ చేయకపోవడం, మోహన్ బాబు బెయిల్ పిటిషన్ ను కోర్టు రిజెక్ట్ చేసిందంటూ వార్తలు రావడంతో ఈ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో మోహన్ బాబు పరారీలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు మోహన్ బాబు. తాను ఎక్కడికి పారిపోలేదని, ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాని స్పష్టం చేశారు.

తన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టేయలేదని అన్నారు మోహన్ బాబు.. తాను ఇంట్లోనే ఉన్నానని.. చికిత్స పొందుతున్నానని స్పష్టం చేశారు మోహన్  బాబు. వాస్తవాలు తెలుసుకొని ప్రసారం చేయాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాని అన్నారు మోహన్ బాబు.  ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు మోహన్ బాబు.