పింక్ బాల్ టెస్టులో గొడవ..సిరాజ్‌‌కు జరిమానా..హెడ్‌‌కు మందలింపు

అడిలైడ్‌‌ : పింక్ బాల్ టెస్టులో గొడవ పడిన టీమిండియా పేసర్‌‌‌‌ మహ్మద్ సిరాజ్‌‌, ఆస్ట్రేలియా బ్యాటర్‌‌‌‌ ట్రావిస్‌‌ హెడ్‌‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఐసీసీ కోడ్ ఆఫ్​ కండక్ట్‌‌లోని 2.5 వ ఆర్టికల్‌‌ను ఉల్లంఘించినందుకు చర్యగా  సిరాజ్ మ్యాచ్‌‌ ఫీజులో 20 శాతం కొత్త పెట్టింది.

హెడ్‌‌ మ్యాచ్ ఫీజులో కోత పెట్టని ఐసీసీ అతడిని మందలించింది. అలాగే, సిరాజ్‌‌, హెడ్‌‌కు చెరో డీమెరిట్‌‌ పాయింట్‌‌ను జరిమానాగా విధించింది. ఈ ఇద్దరూ తమ తప్పును ఒప్పుకొని మ్యాచ్ రిఫరీ రంజన్‌‌ మదుగాలె విధించిన శిక్షను అంగీకరించారని ఐసీసీ వెల్లడించింది.