టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్ తో ప్రేక్షకులను విస్తుపోయేలా చేశాడు. కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పక్షిలా ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ను అందుకున్నాడు. అశ్విన్ బౌలింగ్ లో షకీబ్ భారీ షాట్ కు ప్రయత్నించాడు. ఈ బంతిని అందుకునే క్రమంలో సిరాజ్ వెనక వైపుగా పరిగెత్తుతూ పూర్తిగా గాల్లోకి ఎగిరి సింగిల్ హ్యాండ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ తో ఒక్కసారిగా గ్రౌండ్ మొత్తం షాక్ లోకి వెళ్ళిపోయింది. గతంలో ఫీల్డింగ్ లో విన్యాసాలు చేస్తూ అద్భుత క్యాచ్ లు అందుకున్న ఈ స్టార్ బౌలర్.. మరోసారి తన ఫీల్డింగ్ తో అందరినీ బిత్తర పోయేలా చేశాడు.
ఈ క్యాచ్ తో సిరాజ్ పై నెటిజన్స్ ప్రశంసల వర్షం వర్షం కురిపిస్తున్నారు. జాంటీ రోడ్స్ ను గుర్తు చేస్తున్నావని కితాబులిస్తున్నారు. ఒకేసారి 11 మంది జాంటీ రోడ్స్ లను గుర్తు చేసావని మరికొందరు పొగిడేస్తున్నారు. ఇదే మ్యాచ్ లో సిరాజ్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్ కొట్టిన ఓ బంతిని రోహిత్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అందుకున్నాడు. బంతి తన చేతిలో పడటంతో హిట్ మ్యాన్ సహా ప్రత్యర్థి బ్యాటర్, భారత జట్టు ఆటగాళ్లు అందరూ ఆశ్చర్యపోయారు.
ALSO READ | IND vs BAN 2nd Test: 3 ఓవర్లకే 50 పరుగులు..కాన్పూర్ టెస్టులో టీమిండియా ప్రపంచ రికార్డ్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 74.2 ఓవర్లలో 233 పరుగుల వద్ద బంగ్లా ఆలౌట్ అయ్యింది. 107/3తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లా మరో 126 పరుగులు మాత్రమే జోడించగలిగింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ టీ20 క్రికెట్ తో బంగ్లాదేశ్ కు చుక్కలు చూపిస్తుంది. ప్రస్తుతం 12 ఓవర్లకే 120 పరుగులు చేసింది. జైశ్వాల్ (71), గిల్ (24) క్రీజ్ లో ఉన్నారు.
That's a nice catch by Mohammad Siraj ??#INDvBAN #KanpurTest pic.twitter.com/1BYk4qsLD2
— Rishi (@why_rishi) September 30, 2024