IPL Auction 2025: బెంగళూరు నుంచి గుజరాత్‌కు.. సిరాజ్‌కు రూ.12.25 కోట్లు

ఐపీఎల్ మెగా ఆక్షన్ లో హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు జాక్ పాట్ తగిలింది. అతన్ని గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్ల రూపాయలకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య సిరాజ్ కోసం తీవ్ర పోటీ జరిగింది. అయితే చివరికి గుజరాత్ చెంతకు అతను చేరాడు. మెగా ఆక్షన్ కు ముందు బెంగళూరు సిరాజ్ ను రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసింది. వేలంలో కూడా సిరాజ్ కోసం ఆర్సీబీ ఆసక్తి చూపించలేదు. 

మహమ్మద్ సిరాజ్ గత కొన్నేళ్లుగా ఆర్సీబీ జట్టులో కొనసాగుతున్నాడు. బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషించిన సిరాజ్ 2024 సీజన్ లో మాత్రం దారుణంగా నిరాశ పరిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో పెద్దగా ఫామ్ లో లేకపోవడంతో అతన్ని ఆర్సీబీ రిలీజ్ చేసింది. పెద్దగా ఫామ్ లో లేకపోయినా సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. ఇప్పటికే గుజరాత్ బట్లర్ ను రూ. 15 కోట్ల రూపాయల ధరకు 15.75 మెగా ఆక్షన్ లో దక్కించుకుంది. సిరాజ్ గుజరాత్ టైటాన్స్ కు ఆడడం ఇదే తొలిసారి.