భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్ కు ముందు పెద్దగా ఫామ్ లో కనిపించని ఈ హైదరాబాద్ కుర్రాడు ఆస్ట్రేలియా గడ్డపై చెలరేగాడు. పెర్త్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి రాణించాడు. సిరాజ్ తీసిన 5 వికెట్లు కూడా కీలక బ్యాటర్ లవి కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీసుకున్న సిరాజ్..రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసుకున్నాడు.
రెండో టెస్టుకు ముందు సిరాజ్ ఆత్మ విశ్వాసంతో కనిపిస్తున్నాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా జరగబోయే టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ఆటగాడు మర్నస్ లాబుస్చాగ్నేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్ మాట్లాడుతూ.. “మార్నస్ చాలా ఒత్తిడిలో ఉండడం వలన అతనికి బౌలింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. అతను చాలా బంతులను విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. అది అతని విశ్వాసం అనుకుంటాడు. కానీ అది నిజమైన కాన్ఫిడెంట్ కాదు". అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
ALSO READ | IND vs AUS: రెండో టెస్టుకు రోహిత్, గిల్ సిద్ధం.. అడిలైడ్ టెస్టుకు ఆ ఇద్దరిపై వేటు
పెర్త్ టెస్టులో లాబుస్చాగ్నే, సిరాజ్ కు మధ్య చిన్న మాటల యుద్ధం జరిగింది. సిరాజ్ బాల్ తో త్రో కొడదామని భావిస్తే.. ఆసీస్ బ్యాటర్ దానికి బ్యాట్ తో అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఒక అద్భుత బంతితో సిరాజ్ ఔట్ చేసి రివెంజ్ తీర్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 52 బంతుల్లో లాబుస్చాగ్నే కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
Siraj explains why he loves bowling to Marnus ?#INDvsAUS pic.twitter.com/1GKaLX9qK0
— CricXtasy (@CricXtasy) November 28, 2024