IND Vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్.. బెంగళూరులో షమీ బౌలింగ్

బెంగళూరు టెస్టులో టీమిండియా న్యూజిలాండ్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ షమీ బౌలింగ్ చేస్తూ సర్ ప్రైజ్ చేశాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆధ్వర్యంలో బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ కు బౌలింగ్ వేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. చూస్తుంటే షమీ వేగంగా కోలుకొని త్వరలోనే భారత జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తునాయి. అభిషేక్ నాయర్ తో పాటు తొలి టెస్టుకు దూరమైన గిల్ కు షమీ నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. 

ఇటీవలే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. షమీ పూర్తి ఫిట్ నెస్ సాధించేందుకు  కష్టపడుతున్నాడని.. అతన్ని బలవంతంగా ఆడించడం తమకు ఇష్టం లేదని తెలిపాడు. దీంతో షమీ కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని.. ఈ క్రమంలో అతను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి దూరం కానున్నాడని భావించారంతా. అయితే తాజాగా నెట్స్ లో షమీ బౌలింగ్ చూస్తుంటే ఫిట్ నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో షమీ ఉన్నాడు.

Also Read :- భారత జట్టులో వాషింగ్ టన్ సుందర్.. కారణం ఏంటంటే..?

షమీ వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో కనిపించలేదు. గాయం కారణంగా దాదాపు 10 నెలలపాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు.  న్యూజిలాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ అందుబాటులో లేడు. రంజీ ట్రోఫీ కోసం ప్రకటించిన బెంగాల్ జట్టులో షమీకి చోటు దక్కలేదు. టెస్ట్ ఛాంపియన్ షిప్ కు కీలకమైన ఈ ట్రోఫీకి అనుభవజ్ఞుడు షమీ దూరమైతే భారమంతా సిరాజ్, బుమ్రాపై పడనుంది. భారత్ కు నాణ్యమైన మూడో పేసర్ లేడు. 

గతేడాది వరల్డ్ కప్ లో షమీ 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మడమ గాయానికి గురయ్యాడు. ఫిబ్రవరి నెలలో ఎడమ చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌‌‌‌లోని ఓ హాస్పిటల్‌‌‌‌లో ఈ సర్జరీ నిర్వహించారు.