IPL Auction 2025: సన్ రైజర్స్‌కు షమీ.. భారీగానే ఖర్చు చేశారు

ఐపీఎల్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి భారీ ధర దక్కింది. ఈ భారత పేసర్ ను రూ. 10 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్ దక్కించుకుంది. సన్ రైజర్స్ షమీ కోసం పట్టు పట్టి అతన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో షమీ గాయం కారణంగా ఆడని సంగతి తెలిసిందే. అయితే 2023 లో మాత్రం ఐపీఎల్ గుజరాత్ టైటాన్స్ తరపున ఆడి ఆ సీజన్ లో టాప్ వికెట్ కీపర్ గా నిలిచాడు. 

ప్రస్తుతం షమీ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇటీవలే రంజీ ట్రోఫీలో రెండు ఇన్నింగ్స్ ల్లో 7 వికెట్లు తీసి పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడని నిరూపించుకున్నాడు. షమీ సన్ రైజర్స్ కు ఆడడం ఇదే తొలిసారి. గతంలో ఈ భారత ఫాస్ట్ బౌలర్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తరపున ఐపీఎల్ ఆడాడు. ఇప్పుటికే హైదరాబాద్ జట్టులో ఇప్పటికే అంతర్జాతీయ బౌలర్ పాట్ కమ్మిన్స్ ఉన్న సంగతి తెలిసిందే.