Ranji Trophy 2024-25: గాయంపై ఆందోళనలు.. రంజీ ట్రోఫీలో షమీకి దక్కని చోటు

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ గాయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్టార్ పేసర్ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని అర్ధమవుతుంది. రంజీ ట్రోఫీ కోసం ప్రకటించిన బెంగాల్ జట్టులో షమీకి చోటు దక్కలేదు. అయితే తొలి రౌండ్లకు మాత్రమే షమీ దూరంగా ఉండనున్నాడు. ఆ తర్వాత పూర్తి ఫిట్ నెస్ సాధిస్తే తదుపరి లీగ్ మ్యాచ్ లు ఆడతాడు. అనుభవజ్ఞుడైన షమీ కోలుకోకపోవడంతో బెంగాల్ తో టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. 

నవంబర్ 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ప్రతిష్టాత్కమైన ఈ ట్రోఫీకి షమీ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘ పర్యటనలో షమీ 100 శాతం ఫిట్ నెస్ సాధించడం కష్టం. దీంతో ఈ సిరీస్ కు భారత్ కు బిగ్ షాక్ తగలనుంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ కు కీలకమైన ఈ ట్రోఫీకి అనుభవజ్ఞుడు షమీ దూరమైతే భారమంతా సిరాజ్, బుమ్రాపై పడనుంది. 

ALSO READ | నవ్వులే నవ్వులు.. రోహిత్‌ను పరుగులు పెట్టించిన అభిమానులు

భారత్ కు నాణ్యమైన మూడో పేసర్ లేడు. గతేడాది వరల్డ్ కప్ లో షమీ 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మడమ గాయానికి గురయ్యాడు. ఫిబ్రవరి నెలలో ఎడమ చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌‌‌‌లోని ఓ హాస్పిటల్‌‌‌‌లో ఈ సర్జరీ నిర్వహించారు.

అక్టోబరు 11న ఉత్తరప్రదేశ్‌తో బెంగాల్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బెంగాల్ జట్టుకు అనుస్తుప్ మజుందార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వృద్ధిమాన్ సాహా,అభిమన్యు ఈశ్వరన్,సుదీప్ ఛటర్జీ,షాబాజ్ అహ్మద్,ఆకాష్ దీప్ లాంటి ఆటగాళ్లతో బెంగాల్ జట్టు పటిష్టంగా ఉంది.

రంజీ ట్రోఫీ 2024-25 మొదటి రెండు రౌండ్‌లకు బెంగాల్ జట్టు

అనుస్తుప్ మజుందార్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ ఘరామి, సుదీప్ ఛటర్జీ, వృద్ధిమాన్ సాహా, షాబాజ్ అహ్మద్, అభిషేక్ పోరెల్, రిటిక్ ఛటర్జీ, అవిలిన్ ఘోష్, షువమ్ డే, ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్, సూరజ్ జైస్వాల్, ప్రదమ్ జిస్వాల్, ప్రదమ్ జిస్వాల్ , యుధాజిత్ గుహ, రోహిత్ కుమార్, రిషవ్ వివేక్