ఎన్నికల్లో ఎన్ఎస్​యూఐ కీలకపాత్ర పోషించాలి : మహ్మద్ అవేజ్ అహ్మద్

పాలమూరు, వెలుగు: వచ్చే పార్లమెంట్  ఎన్నికల్లో కాంగ్రెస్  క్యాండిడేట్ల గెలుపులో ఎన్ఎస్​యూఐ కీలకపాత్ర పోషించాలని జిల్లా అధ్యక్షుడు మహ్మద్  అవేజ్  అహ్మద్  పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్  పార్టీ ఆఫీస్​లో మంగళవారం ఎన్ఎస్​యూఐ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల సాధన కోసం ఎన్ఎస్ యూఐ నిరంతరం పోరాడుతోందన్నారు. మణి రత్నం, నరేశ్ యాదవ్, శివ, సమీర్, మహ్మద్ ముజీబ్, హరీశ్, షహబాజ్, సందీప్, రోహిత్, శివ, కేశవులు, నవీన్, ప్రవీణ్, అవినాశ్, మహేశ్, శశాంక్, మనోహర్  పాల్గొన్నారు. 

ఆమనగల్లు: ఎన్ఎస్​యూఐ ఆవిర్భావ దినోత్సవాన్ని కడ్తాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ నాయకులు ఘనంగా నిర్వహించారు. జెండాను టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. భిక్యా నాయక్, యాట నర్సింహ, బిచ్యా నాయక్, షాబుద్దీన్  పాల్గొన్నారు.
 

నాగర్ కర్నూల్ టౌన్: కాంగ్రెస్  పార్టీ ఆఫీస్​ ఆవరణలో ఎన్ఎస్ యూఐ జెండాను సంఘ నాయకులు ఎగరవేశారు. ఇందిరాగాంధీ ఫొటోకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్  ఎంపీ క్యాండిడేట్​ మల్లు రవి మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు సంఘం నేతలు అండగా ఉండాలన్నారు. హబీబ్, తైలి శ్రీనివాసులు, సంతోష్, రాము, సురేందర్, వెంకటేశ్వర రెడ్డి, అభిషేక్, ప్రశాంత్, చందు పాల్గొన్నారు.