ఇంటర్ సెప్టార్ 650 ‘తామ్ రాజ్’ను చూశారా?

ఇంటర్ సెప్టార్ 650 ‘తామ్ రాజ్’ను చూశారా?

న్యూఢిల్లీ: చిన్నా పెద్దా అనే తేడాలు లేకుండా బైక్ నడిపే ప్రతి ఒక్కరినీ రాయల్ ఎన్​ఫీల్డ్ చాలా ఆకర్షిస్తుంది. సొగసైన స్టైల్, రివ్వున దూసుకెళ్లే సామర్థ్యం, స్పీడ్ కంట్రోల్, నడుపుతూ వస్తుంటే ఉట్టిపడే రాజసం ఎన్ ఫీల్డ్ సొంతం. అందుకే రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త బైక్ ఎప్పుడు లాంచ్ అయినా కస్టమర్లు విరగబడి మరీ కొనుక్కుంటారు. దానికి తగ్గట్లే ఖరీదైన సెగ్మెంట్ నుంచి మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేలా 350 సీసీ ఇంజిన్ తో కూడా ఎన్ ఫీల్డ్ బైక్ లను డిజైన్ చేస్తోంది. మోడిఫికేషన్ చేసిన ఎన్ ఫీల్డ్ బైకులకు కూడా మార్కెట్ మంచి గిరాకీ ఉంటుంది.

రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులను చాలా మంది మోటార్ ప్రియులు తమకు నచ్చినట్టు మోడిఫికేషన్ చేయించుకుంటారు. దేశవ్యాప్తంగా చాలా స్టార్టప్ కంపెనీలు ఎన్ ఫీల్డ్ బైకులను మోడిఫికేషన్ చేస్తాయి. అలాంటి వాటిలో ఢిల్లీకి చెందిన నీవ్ మోటార్ సైకిల్స్ ఒకటి. ఇది రీసెంట్ గా రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టార్ 650ని మోడిఫికేషన్ చేసింది. దానికి ఇంటర్ సెప్టార్ 650 తామ్ రాజ్ గా పేరు పెట్టింది. ఈ తామ్ రాజ్ మోడల్ కు కొత్తగా పెయింట్ వేసింది. చేతితో తయారు చేసిన బాడీ పార్ట్స్ ను వాడింది. మంచి లుక్ కోసం వెహికిల్ కస్టమైజేషన్ ప్రొడక్ట్స్ ను కూడా వినియోగించింది. 5–ఇంచ్ (127ఎంఎం) ట్యూబ్ టైప్ టైర్లకు జతగా కస్టమ్ ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్ సిస్టమ్ ను కూడా బిగించింది. మెకానికల్ గా 648 సీసీ ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కు ఎలాంటి ఆల్ట్రేషన్ చేయలేదు. ప్రస్తుతం ఈ బైక్ ఫొటోలు మోటార్ సైకిల్ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇంటర్ సెప్టార్ 650ని తామ్ రాజ్ గా మార్చడానికి నీవ్ మోటార్ సైకిల్స్ రూ. 1.90 లక్షలు వసూలు చేస్తోంది. దీనికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది.