మార్చి 16న నాగర్ కర్నూల్ లో మోదీ సభ

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఈనెల 16న నాగర్ కర్నూల్ ల్​కు ప్రధాని మోదీ వస్తున్నట్లు బీసీ కమిషన్  మాజీ సభ్యుడు ఆచారి తెలిపారు. మంగళవారం నెల్లికొండ చౌరస్తా, ఉయ్యాలవాడ ప్రాంతాల్లో సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ కు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొంటారని తెలిపారు. ప్రధాని మొదటిసారి నాగర్ కర్నూల్​కు రావడం సంతోషకరమన్నారు. 

కేంద్ర ప్రభుత్వ నిధులతో నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్  హైవే, సోమశిల- సిద్దేశ్వరం బ్రిడ్జి పనులు జరుగుతున్నాయని చెప్పారు. భూత్పూర్, శ్రీశైలం హైవే, గద్వాల నుంచి సూర్యాపేట వరకు రైల్వే లైన్  విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. మోదీ సభకు అన్నివర్గాల ప్రజలు తరలివచ్చి సక్సెస్​ చేయాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు, వనపర్తి జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్  జక్కా రఘునందన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీపాచారి పాల్గొన్నారు.