దేశవ్యాప్తంగా ఒకేరోజు ఐదు ఎయిమ్స్ ఆసుపత్రులను ప్రధానీ మోదీ జాతికి అంకితం చేశారు. ఏపీలోని మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చాక 50ఏళ్ల వరకు దేశంలో ఒకే ఒక్క ఎయిమ్స్ ఉండేదని తెలిపారు. అది కూడా దేశ రాజధాని ఢిల్లీలోనే ఉండేదన్నారయన. ఏడు దశాబ్ధాలకు ఏడు ఎయిమ్స్‌లకు మాత్రమే ఆమోదం లభించిందని కానీ అవీ కూడా పూర్తి కాలేదని చెప్పారు.
ఇప్పుడు కేవలం 10 రోజుల్లోనే 7 కొత్త ఎయిమ్స్ ను ప్రారంభించడమో, లేదా శంకుస్థాపన చేయడమో జరిగిందని తెలిపారు. గత ఆరేడు దశాబ్దాలతో పోల్చితే ఇప్పుడు దేశాభివృద్ధి వేగం పుంజుకుందని ఆలోచించాలని కోరారు. చాలా వేగంగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని మోదీ తెలిపారు. ప్రధాని ప్రారంభించిన ఎయిమ్స్ ఎక్కడెక్కడంటే
- మంగళగిరి (ఆంధ్రప్రదేశ్),
- రాజ్‌కోట్ (గుజరాత్),
- బఠిండా (పంజాబ్),
- రాయ్‌బరేలి (ఉత్తరప్రదేశ్),
- కల్యాణి (పశ్చిమబెంగాల్).