కేంద్రం ఒక్కో అకౌంట్ కు రూ.1లక్షా24వేలు డిపాజిట్.. అంటూ చక్కర్లు కొడుతున్న ఫేక్ న్యూస్

కేంద్రం ఒక్కో అకౌంట్ కు రూ.1లక్షా24వేలు డిపాజిట్.. అంటూ చక్కర్లు కొడుతున్న ఫేక్ న్యూస్

ఇటీవల ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వైరల్ అవుతున్న పోస్ట్ లో కేంద్రం ఒక్కో మహిళా అకౌంట్ కు భారీ ఎత్తున డబ్బుల్ని డిపాజిట్ చేస్తుందని ఉంది. అయితే ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో చాలా మంది బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటున్నట్లు, బ్యాంకుల్ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే  కేంద్ర ప్రభుత్వం స్త్రీ స్వాభిమాన్ యోజన పథకం కింద మహిళల బ్యాంక్ అకౌంట్లకు సుమారు రూ.1 లక్షా 24వేలు డిపాజిట్ చేసినట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్న పోస్ట్ లపై కేంద్రం స్పందించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూర్ వైరల్ అవుతున్న పోస్టుల్ని చెక్ చేయగా… ఓ వాట్సప్ నెంబర్ నుంచి ఆ ఫోస్ట్ షేరైనట్లు తెలిపింది. పథకాల్ని ప్రవేశపెడితే కేంద్రం అధికారికంగా ప్రకటిస్తుందని పీఐబీ తెలిపింది.