అన్నట్టుగానే సింధుకు ఐస్ క్రీం ట్రీట్ ఇచ్చిన మోడీ

అన్నట్టుగానే  సింధుకు ఐస్ క్రీం ట్రీట్ ఇచ్చిన మోడీ

ప్రధాని మోడీ మాట నిలబెట్టుకున్నారు. ఒలింపిక్ లో కాంస్య పతకం గెలుచుకున్న  బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఐస్ క్రీం, గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాకు చుర్మా తినిపించారు. ఇవాళ  ఒలింపిక్ ప్లేయర్స్ తో భేటీ అయిన మోడీ.. వారిని అభినందించి విందు ఇచ్చారు. వారితో ప్రత్యేకంగా  కాసేపు మాట్లాడారు.  ఓలింపిక్స్ కు వెళ్లే ముందు ప్లేయర్స్ తో మాట్లాడిన మోడీ..వారికి ఏమి ఇష్టమో తెలుసుకున్నారు. పతకం గెలిచిన తర్వాత  పీవీ సింధుకు ఐస్ క్రీం తినిపిస్తానని చెప్పారు. అన్నట్టుగానే ఇవాళ సింధుతో కలిసి ఐస్ క్రీం, నీరజ్ చోప్రాతో కలిసి చుర్మా సేవించారు.