ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోడీ మూడోసారి ఎన్నికయ్యాడు.పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఏర్పాటు చేసిన ఎన్డీయే పార్లమెంటరీ పక్ష సమావేశంలో ఎన్డీయే కూటమి ఈ మేరకు నిర్ణయించింది. ఎన్డీయే పక్ష నేతగా మోడీ పేరును రాజనాధ్ ప్రతిపాదించగా అమిత్ షా, గడ్కరీ, కుమారస్వామి, చంద్రబాబు బలపరిచారు.ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ మోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
నరేంద్ర మోడీ అంతర్జాతీయంగా దేశానికి ప్రతిష్ట తీసుకొచ్చారని అన్నారు చంద్రబాబు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు మోడీ నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. మోడీ నేతృత్వంలో భారత్ అగ్రదేశంగా ఎదుగుతుందని అన్నారు. ఏం సాధించాలన్న విజన్ కావాలని, మోడీ విజన్ ఉన్న నాయకుడని అన్నారు. భారత్ అగ్రదేశంగా ఎదగటానికి ఇది గొప్ప అవకాశం ఉందని అన్నారు చంద్రబాబు.
మొదటి నుండి ఎన్డీయేతో టీడీపీకి మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. తనకు ఏ ఇజాలు తెలియవని, మానవత్వమే తన ఇజం అని ఎన్ఠీఆర్ అన్నారని గుర్తు చేశారు. తన జీవితంలోనే ఇదొక గొప్ప సందర్భమని అన్నారు చంద్రబాబు.ఎన్నికల సమయంలో కీలక ప్రచార సభల కోసం మోడీ వచ్చారని అన్నారు చంద్రబాబు.