డిసెంబర్ 25న అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్​ రైళ్లు

  • క్రిస్మస్, న్యూ ఇయర్​ వేడుకల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం

సికింద్రాబాద్, వెలుగు: క్రిస్మస్, న్యూఇయర్​వేడుకల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎంఎంటీఎస్​రైళ్ల టైమింగ్స్​ను పొడిగించారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తామని చెప్పారు. లింగంపల్లి– -హైదరాబాద్, హైదరాబాద్–​- లింగంపల్లి, లింగంపల్లి– ఫలక్​నుమా, ఫలక్​నుమా– -లింగంపల్లి స్టేషన్ల మధ్య రాత్రి 10.45 గంటల నుంచి అర్ధరాత్రి12.55 గంటల వరకు అందుబాటులో ఉంటాయని ప్రజలు ఈ సదుపాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 

అలాగే న్యూఇయర్​వేడుకల సందర్భంగా డిసెంబర్​31న అర్ధరాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజామున 2.55 గంటల వరకు ఎంఎంటీఎస్​ రైళ్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. లింగంపల్లి– -హైదరాబాద్, లింగంపల్లి– -ఫలక్​నుమా మార్గాల్లో అన్ని స్టేషన్లలో రైళ్లు ఆగుతాయని అధికారులు తెలిపారు.