చేర్యాల, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులు కాంగ్రెస్‌పార్టీకే ఉన్నాయని వరంగల్, ఖమ్మం, నల్లొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం ఆయన మల్లికార్జున స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్గెలిచేందుకు ప్రతీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు, నాయకులకు మధ్య కార్యకర్తలే వారధులన్నారు. కేసీఆర్‌పాలనలో ప్రజలే కాదు దేవుళ్లు కూడా పరేషాన్అయ్యారని అన్నారు. కొమురవెల్లి మల్లన్నకు సిద్దిపేట జిల్లాలో ఉండేందుకు ఇష్టంలేదని, నాలుగు మండలాలను జనగామ జిల్లాలో కలిపేందుకు తాను, ఎంపీ, ప్రతాపరెడ్డి కలిసి జనగామ జిల్లాకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు.
దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, గూగుల్ సెర్చ్ చేస్తే కూడా దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఎవరంటే పల్లా పేరే వచ్చేట్టుగా ఉందన్నారు. అనంతరం సీపీఐ నాయకుడు అందె అశోక్ ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి నుంచి పెద్దరాజుపేట వరకు బీటీ రోడ్డు మంజూరు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి, చిరంజీవులు, కౌన్సిలర్ నరేందర్, యాదగిరి, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నర్సింగరావు, మల్లేశం, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, లింగమూర్తి, ఆగంరెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.