పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలి : ప్రొఫెసర్ కోదండరాం

బషీర్ బాగ్, వెలుగు: పండుగ సాయన్న జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన పండుగ సాయన్న సేవా పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న సామాజిక వేత్తలు, జర్నలిస్టులు, మహిళా లీడర్లు, కళాకారులు, కవులకు సాయన్న రాష్ట్ర స్థాయి పురస్కారాలను అందజేశారు.

 సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. సాయన్న యావత్ తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.