ప్రతి టీచర్​కి ఓటు హక్కు ఇవ్వాలి

రాబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్కూల్ అసిస్టెంట్ టీచర్లతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్లకి కూడా ఓటు హక్కు అవకాశం కల్పించాలి.. దేశంలో 70% ఉపాధ్యాయులు ప్రాథమిక స్థాయి బోధన చేసేవారే ఉన్నారు. మన రాష్ట్రంలో  దాదాపు 80% టీచర్లు ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులే ఉన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థకు మూలం. సాధారణ ఎన్నికల్లో  ప్రతి ఒక్కరికీ  ఓటు హక్కు అవకాశం ఉన్నట్టే, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రతి టీచర్​కి ఓటు హక్కు అవకాశం ఇవ్వాలి. 

ఆర్టికల్ 171 ప్రకారం ఏర్పడిన మండలిలో తమ సమస్యలు పరిష్కరించుటకు  వివక్ష లేకుండా ప్రతి ఉపాధ్యాయుడికి ఓటు హక్కు కల్పించాలి.  కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంఈ విషయంపై  దృష్టి సారించాలి.  గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడికి ఓటు ఉన్నట్టే ఉపాధ్యాయ ఎన్నికల్లో ప్రతి ఉపాధ్యాయుడికి ఓటు హక్కు ఉండాలి. దాంతో రాజకీయ పునరావాసం కోసం  కాకుండా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్నవారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి తమ వర్గాల సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది.

రావుల రామ్మోహన్ రెడ్డి