జనవరి 3న ఇందిరాపార్క్ దగ్గర భారీ సభ : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ : బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడా నకి వీల్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జాగృతి ఆధ్వర్యంలోజనవరి 3న సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్భంగా ఇందిరాపార్క్ వద్ద బీసీల సభ, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నామని తెలిపారు. బీసీ సంఘాలతో బంజారాహిల్స్లోని తన నివాసంలో కవిత సమావేశమయ్యారు.

ALSO READ : ఇంకా ఉంది: 2 కీలక కేసుల్లో విచారణ వాయిదా

 అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 'స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కా మారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. బీసీల జనాభా ఎంతో తెలియంది హామీ ఎలా ఇచ్చారు? జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారు. కానీ 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదు. 42 శాతం రి జర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహి స్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వం. మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తం. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్ని కలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాకా, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలి' అని కవిత విమర్శించారు.