కర్నూల్ ఎమ్మెల్సీ, వైసీపీ సీనియర్ నాయకుడు చల్లా రామకృష్ణా రెడ్డి కరోనాతో మృతిచెందారు. గత నెల 13న అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఈ రోజు జనవరి 1న చనిపోయారు. ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. చల్లాకు గత నెల 5న కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో కొన్ని రోజులు హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఆ తర్వాత లక్షణాలు ఎక్కువ కావడంతో ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి సీనియర్ నాయకుడిగా పనిచేసిన ఆయన.. గత ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన అంత్యక్రియలు స్వస్థలమైన అవుకులో రేపు జరుగనున్నట్లు సమాచారం. చల్లా మృతి పట్ల వైసీపీ నాయకులు సంతాపం తెలియచేశారు.
For More News..
ఎనీటైమ్ నో వాటర్.. మూలనపడ్డ వాటర్ ఏటీఎంలు
ఈజీ మనీ కోసం డ్రగ్స్ బిజినెస్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. భవిష్యత్తులో నేను బీజేపీలో చేరుతా
