మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు విడుదలైయ్యాయి. మార్చి 28న పోలింగ్ నిర్వహించగా.. షెడ్యూల్‌‌‌‌ ప్రకారం ఏప్రిల్‌‌‌‌ 2నే ఓట్ల లెక్కింపు జరగాలి.  కానీ పార్లమెంట్‌‌‌‌ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆలోచనలో కౌంటింగ్‌‌‌‌ను జూన్‌‌‌‌ 2కు వాయిదా వేశారు. దీంతో ఈరోజు ఉదయం 8గంటలకే కౌంటింగ్ ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. 

ఉమ్మడి జిల్లాకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో  ఈ ఉపఎన్నికల వచ్చింది. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా.. 1,437 మంది ఓటర్లు తర ఓటు హక్కును వినియోగించుకున్నారు.