అల్లు అర్జున్​కు బీజేపీ,బీఆర్ఎస్ వత్తాసు సిగ్గుచేటు : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు: సినీ నటుడు అల్లు అర్జున్ కు బీజేపీ, బీఆర్ఎస్ వత్తాసు పలకడం సిగ్గుచేటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ వల్ల ఒక మహిళ ప్రాణం పోయిందని.. ఆమె కుటుంబం ఛిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తిని అరెస్టు చేస్తే.. ఏమాత్రం సిగ్గు లేకుండా ఆ హీరోకు బీజేపీ, బీఆర్ఎస్ అండగా నిలుస్తున్నాయని మండిపడ్డారు.

ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లో మీడియాకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టం ముందు సామాన్యుడైనా, సెలబ్రెటీ అయినా ఒక్కటేనని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ వల్ల ఒకరు చనిపోతే ఆయన ఇప్పటి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని, అలాంటి వ్యక్తికి ఆ రెండు పార్టీలు మద్దతు తెలపడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ప్రజా సమస్యలపై స్పందించకుండా.. ఇలాంటి వ్యక్తిగత సమస్యలపై స్పందిస్తున్నారు.