పాలమూరుకు త్వరలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

  • ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

పాలమూరు, వెలుగు: మహబూబ్ నగర్ లో ఉన్న ఐటీఐ కళాశాలను టీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహకారంతో త్వరలో అప్ గ్రేడ్ చేయడంతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రారంభించనున్నట్లు  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.  మంగళవారం ఆయన క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ కలెక్టరేట్ ప్రాంగణంలో అబ్దుల్ కలాం, రతన్ టాటా విగ్రహాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ లకు నిర్మిస్తామన్నారు.

దీన్ని కూడా విమర్శిస్తూ బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వికారాబాద్ లోని దామగుండం లో రాడార్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తుంటే దాని వల్ల రేడియేషన్ సమస్యలు వస్తాయని పనికిమాలిన నిందలు వేస్తున్నారన్నారు. కేటీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే గుర్తుండదన్నారు. పట్టణంలోని వీరన్నపేటలోని వెటర్నరీ  ఆస్పత్రిలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ విజయేందిరబోయి, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.