బ్యాంక్ ఖాతాదారుల సంక్షేమం కోసం పని చేయాలి : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ టౌన్ , వెలుగు: ఖాతాదారుల సంక్షేమం కోసం పని చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్​లో పాలమూరు కో ఆపరేటివ్  అర్బన్  బ్యాంక్  లిమిటెడ్  కొత్త కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా ఖాతాదారులకు మెరుగైన సేవలందింస్తుందని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యవర్గ సభ్యులు కండె కుమారస్వామి, కొండా చక్రధర్ గుప్తా, నాగయ్య, గండి వెంకటేశ్వర్లు, కన్నయ్యశెట్టి, నాగజ్యోతి, దామరగిద్ద జ్యోతి, శ్రీనివాస్, రాఘవేందర్, రాజేందర్ కుమార్  పాల్గొన్నారు.  

చెక్కులు పంపిణీ..

పాలమూరు: విద్యుత్ షాక్ తో చనిపోయిన గొర్రెలు, గేదెలకు విద్యుత్  శాఖ మంజూరు చేసిన పరిహారం చెక్కులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. క్యాంప్​ ఆఫీస్​లో మహబూబ్ నగర్  మండలం ఓబులాయపల్లి గ్రామానికి చెందిన నర్సింలుకు రూ.40 వేలు, జమిస్తాపూర్  గ్రామానికి చెందిన సత్తయ్యకు రూ.7 వేలు, కిష్టయ్యకు రూ.14 వేలు మంజూరయ్యాయి. విద్యుత్ శాఖ ఏడీఈ మద్దిలేటి, రూరల్  ఇన్​చార్జి ఏఈ వెంకటేశ్​ పాల్గొన్నారు.