దసరా ఉత్సవాలను ఘనంగా జరపాలి :ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి

  • ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: దేవి శరన్నవరాత్రులు, దసరా వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన దసరా ఉత్సవ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు.  దసరా నవరాత్రులను ఘనంగా జరుపుకుందామని, ఉత్సవాల పవిత్రతకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే సంప్రదాయాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఉత్సవాల నిర్వహణ కోసం మున్సిపల్  కౌన్సిల్  నుంచి రూ.3 లక్షలు, తనవంతుగా రూ.50 వేలు అందజేస్తానని తెలిపారు. మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, మురళీధర్ రావు, రవికుమార్, మోహన్ యాదవ్, రామచంద్రయ్య, బురుజు సుధాకర్ రెడ్డి, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, జి నాగేశ్వర్ రెడ్డి, రామాంజనేయులు, గౌలి వెంకటేశ్, బుట్ట వేదవ్రత్, ముత్యం స్వామి, ప్రభాకర్  పాల్గొన్నారు.