మహిళలను కోటీశ్వరులను చేస్తాం : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

హన్వాడ, వెలుగు: మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం  మండలంలోని కిష్టంపల్లి, గొండ్యాల, లింగన్నపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశీర్వదించినట్లుగానే పార్లమెంట్​ ఎన్నికల్లోనూ కాంగ్రెస్  క్యాండిడేట్ వంశీచంద్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు. 

పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్  ముగిసిన వెంటనే అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. మారేపల్లి సురేందర్ రెడ్డి, టంకర కృష్ణయ్య, మహేందర్, జానకీరాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, చెన్నయ్య, కృష్ణయ్య, అంజిలయ్య పాల్గొన్నారు.