తండా బిడ్డలు మాట ఇస్తే తప్పరు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

హన్వాడ, వెలుగు: తండా బిడ్డలు మాట ఇస్తే తప్పరని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  తెలిపారు.  సోమవారం కొత్త చెరువు, ఎనమీది తండాలతో పాటు పెద్దర్పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే నాలుగున్నరేండ్లు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు‌‌‌‌‌‌‌‌. పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీకి ఓటు వేసి వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. మారేపల్లి సురేందర్ రెడ్డి, దేవేందర్, లక్ష్మణ్ నాయక్, లక్ష్మణ్, రాజు నాయక్, నవనీత, ఎంపీటీసీ మునమ్మ, మహేందర్, చెన్నయ్య, రామస్వామిగౌడ్, యాదయ్య, గౌడ్, కేశవులు, ఖాదరయ్య, రవీందర్ గౌడ్, వెంకటేశ్​ పాల్గొన్నారు.