కేంద్రం బడ్జెట్​లో తెలంగాణపై వివక్ష : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, పక్షపాత వైఖరి అర్థమైందని మహబూబ్ నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన స్పందించారు. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు కేటాయింపులు లేవని, తెలంగాణ విషయంలో తల్లిని చంపి బిడ్డను తీసిండ్రని ఎన్నోసార్లు ప్రధాని వెటకారంగా మాట్లాడారని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, విద్యార్థులు, యువకుల బలిదానాన్ని అపహాస్యం చేశారన్నారు. పీఆర్ఎల్ఐకు నిధులు ఇవ్వలేదని, ఒక్క విద్యా సంస్థను కేటాయించలేదని, పారిశ్రామిక క్యారిడార్​ను ఇవ్వకుండా మొండి చేయి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. తామే తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్  చేశారు.